Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

పశువులతో రోడ్డు పై ప్రమాదాలకు ఆహ్వానం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రాజుపాలెం నుండి రామచంద్రపురం మార్గంలో నిర్లక్ష్య పరిస్థితి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా కిర్లంపూడి  మండలం రాజుపాలెం టు రామచంద్రపురం మార్గంలో వాహనదారులు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ ప్రధాన రహదారి రాజుపాలెం నుండి వీరవరం, తామరాడ, గోనేడ, రామవరం గ్రామాల మీదుగా రామచంద్రపురం వెళ్లే దారిగా ఉపయోగపడుతోంది. ప్రతీరోజూ పలు ఆటోలు, కార్లు, బస్సులు, స్కూల్ వాహనాలు ఈ రహదారిపై వెదజల్లుతున్నాయి.అయితే ఇటీవల కాలంలో ఈ రహదారి దారులపై తీవ్ర నిర్లక్ష్యం కనబడుతోంది. రహదారి ఇరువైపులా పశువులను పొడవాటి తాళ్లతో కట్టి, ఆ జంతువులను రోడ్డుపైకి వదిలేస్తుండటం తారాస్థాయికి చేరింది. ఈ జంతువులు రోడ్డుపై అడ్డుగా నిలబడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. హఠాత్తుగా ఆవు, గేదె వంటి పెద్దపెద్ద జంతువులు వాహనాల ముందుకు వచ్చేయడం వలన ప్రమాదాలకు దారి తీసే పరిస్థితి ఏర్పడుతోంది.ఇప్పటికే ఈ మార్గంపై ప్రయాణం చేయడం ప్రజలకు సవాల్‌గా మారింది. “పట్టపగలే వెళ్తే నరకాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఉంటుంది” అని ప్రయాణికులు వాపోతున్నారు. చిరుచినుకే చాలు, ఈ రహదారి కచ్చితంగా నరకప్రాయంగా మారిపోతుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ రహదారి నిర్మాణం మొదలైంది. కానీ ఇప్పటివరకు పూర్తి కాలేదు. ప్రస్తుతం దీనిని పశువుల ఆశ్రయంగా మలచేశారు అన్న అభిప్రాయం స్థానికుల్లో బలంగా ఏర్పడింది.ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు మోక్షం పొందదు” అని ప్రజలు బాహాటంగానే కామెంట్లు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం సంబంధిత అధికారుల జోక్యం అవసరం. పశువులను నిర్లక్ష్యంగా రోడ్డుపై వదలకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo