Friday, August 8, 2025
🔔 9
Latest Notifications
Friday, August 8, 2025
🔔 9
Latest Notifications

పార్టీ,కులం ,మతం, చూడకుండా సహాయం అందించాలి.. నాయకులకు కార్యకర్తలకు సూచించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

29,70,958 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి 41 చెక్కులను పంపిణీ చేసిన జ్యోతుల నవీన్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, నియోజక వర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై, జగ్గంపేట మండలం నుంచి 24 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు గాను 15,75,894 రూపాయలు, కిర్లంపూడి మండలానికి సంబంధించి తొమ్మిది చెక్కులు గాను 8,65,575 రూపాయలను, గండేపల్లి మండలం సంబంధించి 8 చెక్కులకు గాను 5,29,489 రూపాయలను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు అందరూ గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వైద్యం చేయించుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నవారికి ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా మీరు తీసుకొచ్చి మా కార్యాలయం లో దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎంతమందికైనా మన నాయకుడు జ్యోతుల నెహ్రూ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సాయం అందజేసేందుకు కృషి చేస్తారని ఇప్పటికే 200 మందికి ఆర్థిక సాయం అందించడం జరిగిందని ఇంకా 70 మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారని వారందరికీ కూడా తొందర్లోనే చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు, పోతుల మోహన్ రావు, వీరం రెడ్డి కాశి బాబు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, అభివృద్ధి కమిటీ సభ్యులు మారిశెట్టి భద్రం, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, దేవరపల్లి మూర్తి, అడబాల వెంకటేశ్వరరావు, అనుకూల శ్రీకాంత్, పాండ్రంగి రాంబాబు, నీలం శ్రీను, సొసైటీ చైర్మన్ లు కంటిపూడి సత్యనారాయణ, కందుల కొండయ్య చౌదరి, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, రేఖ బుల్లి రాజు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, బస్వా చిన్న బాబు, ముసిరెడ్డి నాగేశ్వరరావు, కురుకూరి వీర వెంకట చౌదరి, యల్లమిల్లి సీఎం, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo