లబ్ధిదారులకు పింఛన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా గండేపల్లి ప్రతి నెల ఒకటో తేదీన నిరుపేదల ఇళ్ల వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తూ కూటమి ప్రభుత్వం నిరుపేదల కళ్ళల్లో ఆనందం నింపుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.సోమవారం గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని మంచానికే పరిమితమైన తాండ్రంగి వీర బ్రహ్మానందం, అనుకూల విజయ్ కుమార్, పంచకట్ల కాటమరాజు లకు ఇంటింటికి వెళ్లి 15 వేల రూపాయలు పింఛన్ సొమ్ములను అందించారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పథకం నిలిచిందని ఆయన అన్నారు.సామాజిక, ఆర్థిక భద్రత కోసం పింఛన్లు అందిస్తున్నామన్నారు. పెన్షన్ల పంపిణీతో పేదల జీవితాలకు భద్రత, భరోసా లభిస్తుందన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి పించను అందే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, అడబాల భాస్కరరావు, కుంచే రాజా, సొసైటీ చైర్మన్ కంటిపూడి సత్యనారాయణ, ఎండిఓ కర్రి చందర్రావు, య ర్రంశెట్టి బాబ్జి, దిడ్డి చిన్న శ్రీను, రామకుర్తి నరసింహ, కొల్లు త్రిమూర్తులు, కాటేపల్లి భద్రం, తెలగ రెడ్డి భద్రం, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

