Monday, August 4, 2025
Monday, August 4, 2025

పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే బలరామకృష్ణలు ప్రారంభించిన వేళ

జగ్గంపేట

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేశారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలోని ఎత్తిపోతల ప్రత్యేక పూజల అనంతరం మంత్రితో పాటు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణలు మోటార్లను ప్రారంభించి, నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ‘నా సేన నా వంతు’ రాష్ట్ర నాయకురాలు బత్తుల వెంకట లక్ష్మి, పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, రైతులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, “రాష్ట్రంలో సాగునీటి రంగానికి ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో టీడీపీ హయాంలో రూ.72,000 కోట్లు కేటాయించగా, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ కేవలం రూ.32,000 కోట్లు మాత్రమే కేటాయించింది. అందులోనూ రూ.21,000 కోట్లు ఖర్చు చేయడం దురదృష్టకరం” అని విమర్శించారు.గత ఐదేళ్ల పాలనలో కాలువలు, రిజర్వాయర్లు, డ్రైనేజీలకు మెయింటెనెన్స్ జరగలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. “అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతలలో జరిగిన ప్రమాదాలు గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,040 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల్లో 450 పాడైపోవడం వల్ల 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందలేదు” అని వివరించారు.ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టిందని, మొదటి సంవత్సరంలోనే ఓఅండ్‌ఎం (ఆపరేషన్ & మెయింటెనెన్స్) కోసం రూ.700 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. “జూలైలో రూ.90 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.260 కోట్లు, మే నెలలో రూ.360 కోట్లు విడుదల చేశాం. ఇది రైతుల పట్ల మా నిబద్ధతకు నిదర్శనం” అన్నారు.గోదావరిలో 14 అడుగుల ఎత్తుకు నీరు చేరిన వెంటనే మోటార్లు ప్రారంభించే విధంగా సాంకేతిక పర్యవేక్షణ జరగుతుందని అధికారులు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం సాగునీటి రంగాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo