గండేపల్లి మండలం యర్రం పాలెం పుష్కర లిఫ్టు నుండి సుమారు 15 గ్రామాలకు 13000 ఎకరాలకు సార్వ పంట సాగు చేసుకునేందుకు పుష్కర ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ భాస్కరరావు మాట్లాడుతూ మెట్ట ప్రాంత భగీరధుడు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో మెట్ట ప్రాంతానికి పుష్కర ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి రైతులకు నీరందించిన ఘనత ఆయనకే చెందుతుందని తాళ్లూరులిఫ్ట్ ను 55 కోట్లతో సిమెంట్ పైపులు స్థానంలో ఐరన్ పైపులు వేసి మరమ్మతులు చేసేందుకు టెండర్లు కూడా పిలవడం జరిగిందని తొందర్లోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నదాత సుఖీభవ తొందర్లోనే అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కుంచే రాజా, నాయకంపల్లి సొసైటీ చైర్మన్ పాలకుర్తి ఆదినారాయణ, నీటి డిస్ట్రిబ్యూషన్ కమిటీ అధ్యక్షులు పాలకుర్తి లక్ష్మీపతిరావు, డి ఈ మోహన్ రావు, జేఈలు హేమ సుందర్, సుధా, నీటి సంఘం సభ్యులు, ఉండవల్లి వీరభద్రరావు, తతిన నాగేశ్వరరావు, బిక్కిన వెంకట్రావు, సాయి కృష్ణ, భాస్కరరావు, రామచంద్రరావు, కుదప మురళి, వినోద్ కుమార్, సుబ్బారావు, నాయకంపల్లి టిడిపి అధ్యక్షులు ఉండవల్లి చంద్రశేఖర్, య ర్రంపాలెం టిడిపి అధ్యక్షులు ముత్యాల భాస్కరరావు, నాయకంపల్లి, సూరంపాలెం, యర్రంపాలెం, కాట్రావులపల్లి, కోటపాడు, ఆనూరు, మర్రిపూడి తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.