సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ…
ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని ప్రభుత్వ పధకాలు వివరించారు…
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యేలా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం మండపేట పట్టణంలో 4,5,10 వార్డులలో మధ్యాహ్నం ఇప్పనపాడు గ్రామంలో స్థానిక నాయకులతో కలసి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని ప్రభుత్వ పధకాలు వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట నిలుపుకున్న ఘనత కూటమి ప్రభుత్వందని ఆయన అన్నారు. ప్రజల అభిప్రాయం లేని పాలన ఉండ కూడదని, ప్రజల సమస్యలు సావదానంగా తెలుసుకొని పరిష్కరించే ప్రక్రియకు ఇది మొదటి మెట్టు అని తెలిపారు. వయోవృద్ధులు, మహిళలు, యువత అందరితో ముచ్చటించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకుంటామన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తమ పాలనలో ప్రజలను భాగస్వాములుగా చేర్చాలని సంకల్పించిందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మెన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ ,కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.