ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
జగ్గంపేటనియోజకవర్గంలోని ప్రజల ప్రతి సమస్య పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలువురు హాజరై వినతి పత్రాలను ఎమ్మెల్యేకు సమర్పించారు. తమ సమస్యల పరిష్కరించమని కోరారు. ఎమ్మెల్యే తక్షణమే సంబంధిత అధికారులకు సమస్య తెలిపి సత్వరమే సక్రమ పరిష్కారం ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగామల్లేపల్లి లో తురాయి చెట్టు వద్ద నుంచి వేలిది వారి కాలవ వరకు రోడ్డు అద్వాన పరిస్థితుల్లో ఉండడంతో తక్షణమే రోడ్డు వేయించాలని మల్లేపల్లి రైతులతో కలిసి జనసేన జిల్లా కోఆర్డినేటర్ రామకుర్తి నరసింహం ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేయగా ఆ సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా గ్రామాల్లో మౌలిక వసతుల అవసరాలపై ప్రజలు ప్రజా దర్బార్లో తెలియచేయాలని కోరారు. గ్రామాల్లో పారిశుధ్యం, నీటి సరఫరా వంటి ప్రజా అవసరాలపై ప్రజా దర్బార్లో తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమం మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, గోకాడ రాంబాబు, భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ చైర్మన్ గల్లా రామచంద్ర రావు, కాళ్ల వెంకటేష్, నాగం వెంకటపతి, ఆయిల్ స్వామి, బిట్ర ప్రభాకర్ రావు, రామకుర్తి నాగేశ్వరరావు, నంద్యాల గోపాలం తదితరులు పాల్గొన్నారు.