Friday, August 1, 2025
Friday, August 1, 2025

ప్రతి ఉద్యోగి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి..ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఇర్రిపాకలో ఎలక్ట్రికల్ ఈఈ కాకినాడ నల్లం ఉదయభాస్కర్ ఏడు కుటుంబాలకు 70,000 ఆర్థిక సహాయం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

పి4 కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని మార్గదర్శులుగా నిలవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. పి4 కార్యక్రమంపై ఆదివారం జగ్గంపేట మండలం ఇర్రిపాకలో అరవాల అప్పారావు, రామిశెట్టి అప్పారావు, కంద అప్పలరాజు, మాగాపు వెంకటరత్నం, సోమిశెట్టి అన్నపూర్ణ, నాగమల్లి సుబ్బలక్ష్మి, పి నేరెళ్ళకు జ్యోతుల నెహ్రూ సోదరులు జ్యోతుల సుబ్బారావు అల్లుడు ఎలక్ట్రికల్ ఈఈ కాకినాడ నల్లం ఉదయభాస్కర్ కుటుంబం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున 70,000 రూపాయలు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అదేశించారని తెలిపారు. నియోజకవర్గంలో గల అధికారులు, వారి సిబ్బంది ఒకటి కంటే ఎక్కువ కుంటుంబాలను దత్తత తీసుకోవాలని తెలిపారు. సమాజంలో 20శాతం ఉన్నత వర్గాల వారు 20 శాతం అట్టడుగు వర్గాల వారిని దత్తత తీసుకొని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చేందుకు నియోజకవర్గానికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతి గ్రామంలో బంగారు కుటుంబాలు, మార్గదర్శులను గుర్తించాలని తెలిపారు. ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలిపారు. ఆగస్టు 15న ప్రారంభమయ్యే కార్యక్రమానికి వచ్చేనెల 5లోగా బంగారు కుటుంబాలను, మార్గదర్శలను గుర్తించి నమోదు చేయాలని తెలిపారు. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారు కూడా వారి వద్ద పనిచేస్తున్న కుటుంబాలను లేదా ఇతర పేద కుటుంబాలను దత్తత తీసుకొని ఆర్థిక, ఆర్థికేతర అంశాలలో సహాయం, తోడ్పాటు అందించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈరోజు ఏడుగురికి 70,000 ఆర్థిక సహాయం అందించిన నల్లం ఉదయభాస్కర్ ను ఎమ్మెల్యే దంపతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బస్వా చినబాబు, ఎంపీడీవో చంద్రశేఖర్, పిఓపిఆర్డి భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo