ప్రపంచ ఆదివాసిదినోత్సవo లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి :నారా చంద్రబాబు నాయుడు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు మండలం వంజంగి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వనదేవత మోదకొండమ్మను దర్శించుకున్నారు. గ్రామంలోని కాఫీ తోటలను పరిశీలించిన సీఎం వారితో మాట్లాడారు. ప్రజావేదిక వద్ద గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.