జగ్గంపేట గ్రామానికి చెందిన డేవిడ్ రాజు (వయసు: 44 సంవత్సరాలు) అనే వ్యక్తి అనుకోని సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం ప్రకారం, గత ఆరు సంవత్సరాలుగా జగ్గంపేట పంచాయతీలో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్న డేవిడ్ రాజు, తేదీ 29.07.2025 (మంగళవారం) సాయంత్రం పంచాయతీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాడు.
అయితే, తేది 30.07.2025 (బుధవారం) మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో జగ్గంపేటలోని మంచినీటి చెరువులో ఆయన మృతదేహం కనిపించింది. అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న జగ్గంపేట ఎస్ఐ టి. రఘునాథరావు డేవిడ్ రాజు తల్లి ఎల్లె రత్నం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పూర్తి వివరాలు పోస్ట్‌మార్టం నివేదిక రాకతో వెల్లడవుతాయని ఎస్సై తెలిపారు