కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలోని రాజమండ్రి రోడ్డులో, ఆదిత్య హాస్పిటల్ ఎదురుగా రెడ్డి అవినాష్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ భవనోత్సవం చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు విభాగాలను కందుల చిట్టిబాబు, ఎస్.వి.ఎస్. అప్పలరాజు, మారిశెట్టి భద్రం, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ, “జాతీయ రహదారి పక్కనే ప్రాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను జగ్గంపేటలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేశాం. ఈ ప్రాంతంలో మొదటిసారిగా 24 గంటలు అందుబాటు ధరల్లో అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే, సీటీ స్కానర్, అన్ని రకాల రక్తపరీక్షలు తదితర సేవలు అందుబాటులో ఉంటాయి” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డి.ఎస్.పీ. శ్రీహరి రాజు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, సొసైటీ చైర్మన్ కందుల కొండయ్య చౌదరి (బాబ్జి), ముండ్రు ఎర్రబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, నీలం శ్రీను, కురుకూరి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.