గండేపల్లి మండలం జెడ్ రాగం పేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రికి వెళ్లే రోడ్డుకు జాతీయ రహదారి నుండి ఆరోగ్య కేంద్రం వరకు 60 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పరికల ఆసుపత్రిగా జెడ్ రాగం పేటలో సకల సౌకర్యాలతో నిర్మించడం జరిగిందని జాతీయ రహదారి నుండి ఆసుపత్రికి వెళ్లే రోడ్డు యుద్ధ ప్రాతిపదికిన 60 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ నిర్మాణం పలు జరుగుతున్నాయని ఎక్కడ రాజీ పడకుండా పూర్తి నాణ్యతతో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, అడబాల భాస్కరరావు, కందుల చిట్టిబాబు, మారిశెట్టి భద్రం, జాస్తి వసంత్, బొల్లం రెడ్డి రామకృష్ణ, యర్రంశెట్టి బాబ్జి, అడబాల ఆంజనేయులు, దాపర్తి సీతారామయ్య, కందుల కొండయ్య చౌదరి, కురుకూరి వీర వెంకట చౌదరి, దాపర్తి సీతారామయ్య, కంటే సురేంద్ర, డి ఈ ఉమాశంకర్, జేఈ నారాయణమూర్తి, డాక్టర్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.