మతి పోయి మాట్లాడుతున్నారా…
ప్రజలు సమయం కోసం వేచి ఉన్నారు…
సుపరిపాలన పై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపాటు …
అబద్ధపు వాదనలు, అమలు కాని హామీ లు ఇచ్చి మోసాలతో కూటమి నాయకులు అధికారం లోకి వచ్చారనీ మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయం లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి నాయకులు, అధికార పార్టీ ఎమ్మెల్యే మతి పోయి మాట్లాడుతున్నారనీ మండిపడ్డారు. తమకు కళ్ళు లేవని విమర్శిస్తున్నారని వారికి మతి చేడిందని ఎద్దేవా చేశారు. సుపరిపాలన కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతున్న వారి వెనకొచ్చే టిడిపి, కూటమి క్యాడర్ ను అడిగితే కూ టమి వ్యతిరేకత ఎంతుందో చెబుతారన్నారు. ఈ అబద్ధపు కూటమి మెడలు వంచేందుకు ప్రజలు సమయం కోసం వేచి ఉన్నారనీ చెప్పారు.వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పథకాలు అమలు చేశామని చెబుతున్న వారు ఒక్కసారి గుండెలపై చేయ వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు జాయింట్ గా సంతకాలు చేసి అధికారం లో వస్తె చేకూరే లబ్ది కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారని పేర్కొన్నారు.యాప్ లో నమోదు చేసి ఓటీపీ తీసుకొని డబ్బు వచ్చేస్తుందని చెప్పారన్నారు. పేదవాడీ బలహీనత ను ఆసరా గా తీసుకుని అధికారం లోకి వచ్చారని విమర్శించారు. 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో బిల్లులు చెల్లించినట్లు ప్రభుత్వం చెబుతుందని దీనికి విరుద్ధంగా రైతులు తమ బిల్లులు కోసం ధర్నా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కలెక్టరేట్ ను ముట్టడిస్తున్నారని చెప్పారు. రెండు నెలలు గడుస్తున్న ధాన్యం కు సొమ్ములు పడ్లేదన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతులకు 20 వేలు ఇస్తామన్నారు.ఇప్పటి వరకు దాని ఊసు ఎత్తడం లేదని విమర్శించారు.ప్రజలను, అన్నివర్గాలను మోసం చేశారన్నారు. పథకాలన్నీ అరకొరగా అమలు చేసి అన్ని చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.నిరుద్యోగులకు ఒక్కరికి నెల కు 3 వేలు చొప్పున ఏడాది కి రు 36 వేలు చెల్లించాల్సి ఉందని ఎపుడు ఇస్తారని ప్రశ్నించారు.ఉద్యోగలు కల్పిస్తామని చెప్పారని ఎక్కడ కల్పించారు , ఏ ఏ కంపెనీల్లో కల్పించారో సమాధానం చెప్పాలని నిలదీశారు. వైసిపి నాయకులకు కళ్ళు కనబడటం లేదని విమర్శించారని కూటమి నాయకులకు బుర్ర పనిచేయడం లేదని తిప్పి కొట్టారు.మోసం అబద్ధాలు, దోపిడి తోవ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని విమర్శలు చేశారు. కూటమి ఇచ్చిన వాగ్దానాన్ని బూటకపు వాగ్దానాలని మండిపడ్డారు. గత ఏడాది ఇవ్వాల్సిన తల్లి కి వందనం పథకం ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది ఈ పధకం లో 86 లక్షల మంది కి ఇవ్వాల్సి ఉండగా కేవలం 66లక్షల మందికి మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు.ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా అందరికీ తల్లి కి వందనం ఇస్తామని చెప్పి ఇపుడు కరెంటు బిల్లులు, కార్లు ఉన్నాయని, ట్యాక్స్ పే చేస్తున్నారని నిబంధనలు విధించి కోత పెట్టారని దుయ్యబట్టారు.ఇపుడు వారంతా సచివాలయం చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షలు మంది వాలంటీర్ లు ఉండగా వారికి రూ 10 వేలు జీతం ఇస్తామని చెప్పి వారిని విధులు నుండి తొలగించడం సుపరిపాలనా అంటూ ప్రశ్నించారు.ఎక్కడో ఊరికి దూరం గా ఉన్న మద్యం షాపు లు ఊరి మధ్య లో ఏర్పాటు చేసి డోర్ డెలివరీ చేయడం సుపరిపాలనా అంటూ ప్రశ్నించారు.జగన్ హయంలో రేషన్ డోర్ డెలివరీ చేస్తే ఇవాళ మద్యం డెలివరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. దోపిడి పాలన చేస్తూ సుపరిపాలన ఆనడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో గెలుపే ముఖ్యం గా అమలు కాని హామీలు ఇచ్చి అధికారం లో వచ్చారని అన్నారు. ఇప్పుడు గడప గడప కి వెళుతున్నారని ఎదురుగా చెప్పలేకపోవచ్చని, వెనుక వచ్చే వారు ఏమనుకుంటున్నారో గమనించుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు నెలకు 15 వందలు చొప్పున ఏడాదికి 18 వేలు ఎపుడు ఇస్తారని ప్రశ్నించారు. ఉచిత బస్సు హామీ మూడు సార్లు వాయిదా వేశారని ఇపుడు ఆగస్టు 15 అంటున్నారని పేర్కొన్నారు. ఎస్ సి, ఎస్ టి, మైనార్టీ,బీసీ లకు తీరని అన్యాయం చేశారని చెప్పారు. ఇద్దరు ముగ్గురికి రుణాలు ఇచ్చి మోసాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. 45 నుండి 60 ఏళ్లు ఉన్న వారందరికీ జగన్ ఏడాది రూ 18 వేలు వేసేవారన్నారు. 50ఏళ్ల కే పింఛను ఇస్తారని చెప్పారని ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.ప్రజలు కూటమి తీరుపై ఏమనుకుంటున్నారో సర్వే నిర్వహించుకోవాలని హితవు పలికారు. ఎక్కడ చూసినా దౌర్జన్యం,దోపిడి తప్పితే వేరే లేదన్నారు. ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కే లా కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎవరైనా రాజ్యాంగం పై ప్రమాణం చేసి పరిపాలన చేస్తారని దీనికి భిన్నంగా చంద్రబాబు వైసిపి వారికి ఏమి చేయను, వారిని దగ్గరికి రావద్దంటున్నారని ఇటువంటి ముఖ్య మంత్రి నీ ఎక్కడ చూడలేదన్నారు.జగన్ కులం, మతం, పార్టీ అనే బేధం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏడాది లక్ష 64 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. జగన్ ఐదేళ్లలో 3.60 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుని పోయారని దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు కు ఆర్థిక పరిస్థితి తెలియదా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీలిచ్చే సమయం లో ఈ ఆర్థిక స్తితి తెలియదా ఎందుకు అమలు కాని హామీలు ఇచ్చి ఇపుడు చేతులు ఎత్తేశారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన సమయం లో తగిన రీతి లో బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కర్రీ పాపారాయుడు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు,మున్సిపల్ కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, కపిలేశ్వరపురం ఎంపిటిసి గొల్లపల్లి సోనియా, నియోజకవర్గ ఐటీ వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు, వైఎస్ఆర్సిపి నాయకులు యర్రగుంట అయ్యప్ప, మేడిశెట్టి దుర్గారావు, కట్టా మురళీ తదితరులు పాల్గొన్నారు.