కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామానికి చెందిన బోధ శివ భద్ర రావు తన తప్పును తెలుసుకొని పరివర్తన చెంది క్రిస్టియన్ మతం వీడి తిరిగి సొంత ఇంటికి హిందూ ధర్మంలోకి సనాతన ధర్మం విలువలు సాంప్రదాయాలు తెలుసుకొని, మనం మన పూర్వీకులు హిందూ ధర్మంలోని పుట్టాము మన దేశం హిందువు దేశం హిందువుగా ఉంటేనే ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అలాగే ధర్మ మార్గంలో నడుస్తాము మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి బుద్ధి కలుగుతుందని తెలుసుకొని కుటుంబ సమేతంగా హిందూ ధర్మం లోకి రావడం జరిగింది ,వారిని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ముందుగా సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద వారికి ప్రత్యేక పూజలు చేయించి, భారతీయ ధర్మ పరిషత్ ఆఫీస్ దగ్గర, వారిని సత్కరించి వారు ధర్మ మార్గంలో సనాతన ధర్మం వైపు నడవాలని మానవ జీవితాలను మార్చగలిగే శక్తివంతమైన భగవద్గీత పుస్తకం వారికి ఇచ్చి వారిని ధర్మ మార్గంలో ధర్మ రక్షణకై సనాతన ధర్మం కోసం పాటుపడాలని కోరుతూ వారిని అభినందించి శివ కుమార్ మాతోపాటు హిందూ ధర్మ మార్గంలో సనాతన ధర్మం వైపు నడవాలని కోరుతూ వారినినాగేంద్రచౌదరిఅభినందించారు. ముందుగా దేశంలోని వివిధ హిందూ దేవాలయాలు దర్శించుకున్నామని అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచిన నాగేంద్ర చౌదరి చేస్తున్న సేవలను ఈ సందర్భంగా అభినందించిన శివ భద్ర రావు. ఈ కార్యక్రమంలో బద్ది సురేష్, రెడ్డి సాయి, ప్రసాద్, ముచ్చుపల్లి వీర్రాజు, సాయికుమార్, స్వామి పలువురు భక్తులు పాల్గొన్నారు.