దివ్యాంగుల మధ్య పెళ్లిరోజు జరుపుకుని వారికి అన్నదానం నిర్వహించారు
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన టిడిపి ఎస్సీ నాయకులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఇంజరపు దుర్గ బాబు మేరీ దంపతులు ప్రతి సంవత్సరం వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గత సంవత్సరం తాళ్లూరు జి య్యాన్న ఆలయానికి 25 వేల రూపాయల ఇన్వెర్టర్ బహుకరించారు. తర్వాత సౌండ్ సిస్టం బహుకరించారు. ఈ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా జగ్గంపేట భవిత కేంద్రంలోని దివ్యాంగుల స్కూల్ కు 13000 రూపాయల ప్రింటర్ బహుకరించారు. అనంతరం దివ్యాంగుల కు భోజనాలు ఏర్పాటు చేసి వారితో పాటు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా దుర్గ బాబు మాట్లాడుతూ ముందుగా మా ఇష్టదైవం తాళ్లూరు వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నామని ప్రతి పెళ్లి రోజుకు మా దంపతులం ఆర్భాటాలకు పోకుండా ఏదో సేవా కార్యక్రమం చేయాలని సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవిత స్కూల్ సిబ్బంది అప్పాల పెద్దకాపు, చినబాబు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.