చంద్రబాబు గెలుపు సరే,పవన్ కళ్యాణ్ గెలిచారా ! గెలిపించారా !
– ఎన్నికల సంఘం అక్రమాలపై సి బి ఐ/రా సంస్థలతో సంయుక్త ధర్యాప్తుకు ఆదేశించాలి..
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
పిఠాపురం గెలుపులో పవన్ కళ్యాణ్ విజయ రహస్యం ఏమిటి ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు.
మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ “గాజుగ్లాస్” గుర్తు “రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్” పార్టీ ని మోసం చేసి సాధించుకున్నారని , ఎన్నికల సంఘం పై అధికారిక ఒత్తిడి చేయించి గుర్తు కోసం మేము ముందుగా చేసిన దరఖాస్తును మాయ చేసి అడ్డగోలుగా అడ్డదారిలో గుర్తును పొందారు . పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు అతని అంతర్గతానికి అస్సలు పొంతన వుండదని , చెప్పేవి శ్రీ రామ నీతులు చేసేవి పవన్ కళ్యాణ్ పనులు అన్నట్టు వుంటాయనటంలో ఏ మాత్రం సందేహం లేదని , పవన్ కళ్యాణ్ అవినీతి అధికారులను కొనొచ్చును,అధికార దుర్వినియోగంతో చట్ట నిబంధనలను దారి మళ్ళించ వచ్చును కాని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆత్మ విశ్వాసాన్ని కొనలేరని, ఆర్పిసి ఆత్మష్టైర్యానికి ఎదురు నిలిచి గెలవ లేరని, పవన్ కళ్యాణ్ అడ్డదారిలో పొందిన గాజుగ్లాస్ గుర్తుతోనే మేముకూడా పోటి చేసి నిరూపించిన ఏకైక రాజకీయ పార్టీ అర్పిసి పార్టీ అని గర్వాంగా చెబుతున్నాము . మమ్మల్ని మోసం చేసి ఎన్నికల సంఘం ను లోబరచుకుని పవన్ కళ్యాణ్ గాజుగ్లాస్ గుర్తు అడ్డగోలుగా పొందినప్పటికి మా అర్పిసి పార్టీ కూడా అదే గాజుగ్లాస్ గుర్తుతో న్యాయ పరమైన హక్కుతో పోటీచేసి నోరూపించుకున్న ఘనత మా అర్పిసి పార్టీ సొంతం అని ఆయన గర్వాంగా చెప్పారు .2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదని , పవన్ కళ్యాణ్ గెలిచారు అని చెప్పగల దమ్ము దైర్యం పవన్ కు వుందా ! పవన్ కళ్యాణ్ గెలిచారు అనటం కన్నా గెలిపించారు అనటం సాహెతూకం అని, శాస్త్రీయ పరంగా పవన్ కళ్యాణ్ గెలవ లేదని నిరూపించే సామాజిక సాక్ష్యా దారలను మేము నిరూపించగలమని , పవన్ కళ్యాణ్ పిఠాపురం కొటగుమ్మం సెంటర్ లో నిలుచుని శ్రీ వల్లబుని సాక్షిగా ప్రజలు వేసిన ఓట్ల తోనే గెలిచాను అని నిరూపించుకునే సత్తా పవన్ కళ్యాణ్ కు వుందా ! అని , చంద్రబాబు గెలిచారు అనటంలో తప్పు లేదని , పవన్ కళ్యాణ్ గెలిచారు అంటే మహా పాపం వెంటాడుతుందని , పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఓట్లు వేసి గెలిపించలేదు.మరి ఎలా గెలిచారు.ఎవరు గెలిపించారు అనే రాజకోట రహస్యం విప్పగల నేర పరిశోదన సంస్థ గాని , అంత గొప్ప మీడియా గాని భారతదేశంలో సగటు భారతీయుడు చూడగలడా అని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.
మోసంతో పవన్ కళ్యాణ్ విజయాన్ని చాటుకుంటే అధికార దుర్వినియోగానికి బాధితులుగా ఓటమి మమ్ములను వెంటాడిందని , మాకు వేసిన ప్రతి ఓటు మా బావజాలాన్ని నమ్మి వేసిన ఓటు అని , పవన్ కళ్యాణ్ కు వేసిన ప్రతి ఓటు చంద్రబాబు ను చూసి వేసిన ఓటు మాత్రమే నని , కొన్ని ప్రలోబాలను నమ్మి ఓటర్లు మోసపోయిన ఓట్లే నని పవన్ కళ్యాణ్ మరువరాదని,అడ్డ దారిలో గాజుగ్లాస్ గుర్తు సాధించినా, రాజకీయంగా అధికారం పొందినప్పటికీ నేటి చరిత్ర పవన్ కళ్యాణ్ ను క్షమించదని, మీ మోసాలకు మేము ఓడిపోయినా సిద్ధాంత పరంగా పవన్ కళ్యాణ్ ఎన్నటికీ గెలవలేరని , 2024 ఎన్నికల్లో ఈ వి ఎమ్, ల అక్రమాలకు తోడుగా బారిగా జరిగిన అధికార దుర్వినియోగం మోసంతో జత కట్టిందని , పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గం మొత్తం వ్యతిరేకించి ఓటర్లు వ్యక్తిగత శాపనార్దాలు పెట్టి ప్లెక్సీలు తగుల పెట్టినా వేల సంఖ్యలో పవన్ కళ్యాణ్ ను విజయం వరించిటం పిఠాపురం ప్రజలనే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిందని , పవన్ కళ్యాణ్ విజయంగా చెప్పుకుంటున్న ఎన్నికల మోసాలు, అక్రమాల రాజకోట రహస్యం ఏదో ఒక నాడు భహిర్గతం కాక తప్పదని, ఆ నాడు పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు మొఖం కూడా చూపించలేరని , పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తాత్కాలిక విజయం అంతా మమ్ములను మోసం చేసి సాధించినదే నని మరువ కూడదని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ గుర్తు చేసారు.