ఇంటింటికీ సంక్షేమ పథకాలపై కరపత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట మండలానికి చెందిన మల్లి సాల గ్రామంలో ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ ఇంచార్జ్ పైడిపాల సూరిబాబు నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో నెలకొన్న కూటమి ప్రభుత్వం గత ఏడాదిలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని పేర్కొన్నారు. “తల్లికి వందనం”, గృహాల మంజూరు, ఇంటి స్థలం కల్పన, ఎన్టీఆర్ పెన్షన్ వంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి చేరవేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తూ, భవిష్యత్తులో అమలు చేయవలసిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడుతుందని తెలిపారు.
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం గొప్ప వేదికగా మారిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే సుసంపన్నమైన పాలన సాధ్యమని, అందుకు అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పైడిపాల సూరిబాబు, పైడిపాల సత్తిబాబు, సర్వసిద్ధి లక్ష్మణరావు, కానవరెడ్డి రామకృష్ణ, పల్లికొండ భద్రం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుమ్మల్ల అనంతలక్ష్మి, ముత్తా రాజబాబు, సియాధుల పెద్దకాపు, కానవరెడ్డి శ్రీను, చాట్ర జగ్గారావు, జొన్నాడ వీరబాబు, జాజుల శ్రీను, సియాధుల శివరామకృష్ణ, బొమ్మిడి చక్రం తదితరులు పాల్గొన్నారు.