20 October 2025
Monday, October 20, 2025

మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తరుణంలో జగ్గంపేట శాసనసభ్యులు టిటిడి బోర్డు మెంబర్ జ్యోతులను గోకవరం డిపోలో ఉచిత బస్సును ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేసిన మహిళలు. ఉచిత బస్సు కు జెండా ఊపి, మహిళలతో ప్రయాణం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఐదు రకాల బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం సాగించే అవకాశం ప్రభుత్వం కల్పించిందని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ ,మెట్రో ఎక్సప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం చేయవచ్చు అన్నారు. ఈ పథకం ద్వారా 2.6 2 కోట్ల స్త్రీలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకానికి సంవత్సరానికి 1942 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తుందన్నారు.
ఆధార్ కార్డ్ ,రేషన్ కార్డ్ , ఓటర్ కార్డ్ ఏదైనా చూపిస్తే మహిళలకు ఉచిత ప్రయాణం చేయవచ్చు అన్నారు. ఉచిత ఉచిత బస్సు ప్రయాణం ట్రాన్స్ జెండర్లకు కూడా వర్తిస్తుందని వారు కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చునన్నారు. రాష్ట్రవ్యాప్తంగా8458 బస్సులను ప్రభుత్వం కేటాయించిందన్నారు.ఆధార్ కార్డు చూపించగానే కండక్టర్ నుండి జీరో అమౌంట్ తో టికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.డ్రైవర్ల కొరత అధిగమించడానికి నూతనంగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏపీలోని ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.మహిళామ తల్లులకు ఉపాధి కొరకు ఉద్యోగాలు చేసుకునే వారికి ఈ పథకం ఎంతోఉపయోగపడుతుందన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుండి సూపర్ సిక్స్ పథకాలకు స్వీకరించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి నియోజవర్గ స్థాయి మండల స్థాయి కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo