సిఎం చంద్రబాబుకు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు పాలాభిషేకం
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామంలో గ్రామ టిడిపి అధ్యక్షులు సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ (య ల్లమిల్లిసీఎం) ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుండి మహిళలకు కూటమి ప్రభుత్వం శ్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందిస్తున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముఖ్యంగా మహిళలకు ఉచిత గ్యాస్, తల్లికి వందనం, ఉచిత బస్సు అందించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అందుకే పాలాభిషేకం చేస్తున్నామని మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు గండేపల్లి మండల టిడిపి కార్మిక శాఖ అధ్యక్షులు చీకట్ల నాగరాజు పాల్గొన్నారు.