Friday, August 1, 2025
Friday, August 1, 2025

మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి శక్తి యాప్ పై అవగాహన, ఈగల్ క్లబ్‌ల ద్వారా మత్తు పదార్థాల నివారణకు చర్యలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, ఐ.పి.ఎస్ మహిళలు మరియు పిల్లల భద్రత విషయమై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం గురువారం జగ్గంపేట సర్కిల్ ఆఫీస్ వద్ద కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి మండలాల మహిళా సంరక్షణ కార్యదర్శులకు (మహిళా పోలీసులకు) మోటివేషన్ సమావేశాన్ని జగ్గంపేట సీఐ వై .ఆర్.కె శ్రీనివాస్ని ర్వహించారు.ఈ సమావేశంలో జి ఎం కె ఎస్ లు తమ తమ గ్రామాల్లో మహిళలతో ప్రత్యక్షంగా సంప్రదించి ‘శక్తి యాప్’ను డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారికి సూచించడంతో పాటు, మహిళల భద్రత కోసం ఈ యాప్ ఉపయోగకరమని వివరించారు.ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళా పోలీసులు తరచూ ఆ విద్యాసంస్థలను సందర్శించి ఈగల్ క్లబ్ సభ్యులతో కలిసి మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థులలో గ్యాంజా, మత్తు పానీయాలు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, తరచూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. విద్యాసంస్థల ప్రారంభం, విరామ సమయాల్లో మహిళా పోలీసులు అక్కడే ఉండి విద్యార్థినులకు భద్రత కల్పించాలి అని కోరారు.ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” పేరిట, విద్యాసంస్థల పరిసరాల్లో 100 గజాల పరిధిలో సిగరెట్లు మరియు పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ మహిళా హాస్టళ్లను తరచూ సందర్శించి, హాస్టల్లో ఉన్న విద్యార్థినులలో చైతన్యం నింపుతూ శక్తి యాప్ ద్వారా భద్రత పొందవచ్చునని తెలియజేయాలి అని సూచించారు.ఇకపోతే, గ్రామాల స్థాయిలో “క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ అవేర్‌నెస్ క్యాంపెయిన్లు” నిర్వహించి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహిళలకు భద్రత కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్‌కు చెందిన మహిళా పోలీసులు (జి ఎం కె ఎస్)గణంగా పాల్గొన్నారు.
సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన జగ్గంపేట సీఐ వై.ఆర్.కె ను అభినందించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo