కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ మిస్సింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటువంటి ఘటనలపై అన్ని కోణాల్లో విచారణ చేసి బాధితులను సురక్షితంగా గుర్తించి, బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులకు నిర్దేశాలు జారీ చేశారు.ఈ క్రమంలో గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల వివాహిత భర్త వద్దకు వెళ్లడానికి నిరాకరించి, కుటుంబ సభ్యులకు తెలియకుండా మిస్సింగ్ అయిన ఘటనపై గండేపల్లి పోలీస్ స్టేషన్‌లో సి అర్ నెంబర్ 114/2025 యూ /స్ ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు అయింది.ఈ కేసును అధిక ప్రాధాన్యతతో తీసుకున్న గండేపల్లి ఎస్‌ఐ శివ నాగబాబు మరియు ఆయన పోలీసు బృందం వివిధ టీమ్ లు గా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టి, తగిన ఆధారాలను సేకరించారు. చివరకు పక్కా సమాచారం ఆధారంగా ఆమెను నెల్లూరు పట్టణంలో గుర్తించి, అక్కడికి వెళ్లి సురక్షితంగా పోలీసులు ఆమెను పట్టుకుని గండేపల్లికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె తల్లికి అధికారికంగా అప్పగింపు చేశారు.ఈ విజయవంతమైన చర్యకు గాను జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ మరియు గండేపల్లి పోలీస్ బృందానికి ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్ పి మార్గదర్శకంలో మిస్సింగ్ కేసుల పరిష్కారానికి పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.