కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు, జగ్గంపేట పోలీసులు ఓ మిస్సింగ్ యువతిని కేవలం మూడు గంటల వ్యవధిలోనే ట్రేస్ చేసి, సురక్షితంగా బంధువులకు అప్పగించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.చిల్లంగి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి, ఇటీవల జగ్గంపేటలో బంధువుల ఇంటిలో నివసిస్తున్న సమయంలో మిస్సింగ్ అయినట్లు సమాచారం అందింది.
ఈ మేరకు జగ్గంపేట ఎస్‌ఐ రఘునందన్ రావు నేతృత్వంలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిరంతర అన్వేషణతో మూడు గంటల్లోనే యువతిని ట్రేస్ చేసి, తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ వేగవంతమైన చర్యకు స్థానిక ప్రజలు పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఆపరేషన్‌కు సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ సమన్వయం అందించారు.