Monday, August 4, 2025
🔔 9
Latest Notifications
Monday, August 4, 2025
🔔 9
Latest Notifications

ముస్లిం జె ఏ సీ ఎవరికి లాభం కోసం…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మైనార్టీ సమస్యలపై ఏం సాధించారు…

ఖాబరస్తాన్ హామీ ఏమైంది…?

షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా…

మండపేట

మండపేట ముస్లిం జె ఏ సి ఎవరికి లాభం కోసం ఏర్పాటు అయిందో ముస్లిం లకు చెప్పాలని షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీ ల సమస్యలపై ఏదైనా సాధించారా అంటూ నిలదీశారు.ఎన్నికల ముందు ముస్లిం లకు అవసరమైన స్మశాన వాటికకు స్తలం ఇస్తామని ఇచ్చిన హామీనీ  సాధించారా అంటూ ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసేందుకు ఏర్పాటు  చేసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు.జేసియా ముస్లిం హక్కుల గురించి పోరాడే ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఖాబరస్తాన్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.  దానిపై పోరాటం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా  ముస్లిం లకు వ్యతిరేకం గా బిజెపి వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశ పెడితే  దానిపై ఈ మండపేట జేఏసీ నాయకులు కానీ మండపేటలో ఉన్న నాలుగు మసీదుల్లో ఉన్న కమిటీ సభ్యులు కానీ  స్పందించకపోవడం  హాస్యాస్పదంగా  వుందని ఎద్దేవా చేశారు. ఏదో రాజకీయ లబ్ధి కోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసినట్లు ఉందన్నారు. జేఏసీ ఏర్పాటు చేసి ముందు నాలుగు మసీదులు వున్న జమాత్( ప్రజలను) కూర్చోబెట్టి చర్చించి జేఏసీ సభ్యులు ఎన్నుకోవాలన్నారు. ఏదో నలుగురు మసీదు కమిటీలు కూర్చుని ఒక జేఏసీగా ఏర్పడడంపద్ధతి కాదన్నారు. జేఏసీ అంటే ముస్లిం హక్కుల పరిరక్షణ కోసం పార్టీలకు, జమాత్ లకు అతీతంగా ముస్లిం హక్కుల కోసం పోరాడితే చాలా సంతోషమని పేర్కొన్నారు.ఈ జేఏసీఅధికార పార్టీకి అనుకూల వర్గం లా వుందని విమర్శించారు.పార్టీలు పక్కన పెట్టి జమాత్ లు పక్కన పెట్టి ఒక జేఏసీగా ఏర్పడాలనుకున్నప్పుడు నాలుగు మజిద్ లలో సాధారణ ముస్లిం లను సమావేశం నిర్వహించి ఒక జేఏసీగా ఎన్నుకుంటే మంచిదనీ హితవు పలికారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo