ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
గండేపల్లి మండలం యర్రంపాలెంగ్రామంలోసుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రతి ఇంటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ప్రజల కోసం చేసిన అభివృద్ధి, చేపట్టిన పథకాల గురించి వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఇంకా ఏమన్నా సమస్యలు పరిష్కారం కాలేదా అనే దానిపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సంవత్సర కాలంలో కూటమీ ప్రభుత్వ పాలన బాగుందని, అభివృద్ధి, సంక్షేమం కూడా జరిగిందని స్థానికులు వారి దృష్టికి తీసుకువచ్చి సంతృప్తిని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, కుంచే రామకృష్ణ, సుంకవిల్లి రాజు, గ్రామ సర్పంచ్ ముత్యాల దుర్గారావు, ఉండవీల్లి చందు, పోసిన బాబురావు, ముత్యాల భాస్కరరావు, బిక్కిన వీర వెంకటరావు, ముత్యాల వీరభద్రరావు, పెదపాటి శుభకర్, ముత్యాల రాంబాబు, పాలకుర్తి సత్తిబాబు, ముత్యాల గంగారావు, ఈజీ నలక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.