Monday, August 4, 2025
Monday, August 4, 2025

యువత ఓటు హక్కు పై అవగాహన కలిగి ఉండాలి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రాజకీయ పక్షాల సమావేశం…

మండపేట

మండపేట లో శనివారం సాయంత్రం తహశీల్దార్ వారి కార్యాలయం, మండపేట నందు నెం.48 మండపేట అసెంబ్లీ నియోజక వర్గం ఓటరు నమోదు అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలక్టర్, కె.ఆర్.ఆర్.సి. పి.కృష్ణమూర్తి అందరు జాతీయ మరియు రాష్ట్ర గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల దరఖాస్తులు ఫారం-6, 7 మరియు 8 లకు సంబంధించిన స్టేటస్ వివరములు, బూత్ లెవెల్ అధికారుల జాతీయ శిక్షణా కార్యక్రమం షెడ్యూల్, రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ప్రతిపాదనలు మరియు ఎన్నికల విభాగమునకు సంబంధించిన ఇతర విషయములు చర్చించియున్నారు. సదరు సమావేశంలో తెలుగుదేశం పార్టీ  ఉంగరాల రాంబాబు, బి.జె.పి పార్టీ వి.దుర్గా ప్రసాద్ మరియు రమణ, వైస్సార్సీపీ పార్టీ యరమాటి వెంకన్నబాబు, జనసేన పార్టీ నామాల చంద్రరావు, కాంగ్రెస్ పార్టీ ఎం.జె. రాజ్ బాబ్ లు హాజరు అయినారు. ఉంగరాల రాంబాబు మాట్లాడుతూ ప్రతీ పోలింగ్ స్టేషన్ లో ఓటర్లు సంఖ్య 1000 కంటే తక్కువ ఉండే విధంగాను, బి.జె.పి. పార్టీ నుండి టిడ్కో అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ వారి ఓట్లు వేరు వేరు పోలింగ్ స్టేషన్ లలో నమోదు అయినవి కనుక ఓట్లు నివాసం ఉన్న ప్రదేశంలో గల పోలింగ్ స్టేషన్ నకు ఓటు బదిలీ చేయవ లెననియు, వైసీపీ యరమాటి వెంకన్నబాబు మాట్లాడుతూ ఈవీఎం మిషన్ ద్వారా ఓటు వేసిన తదుపరి వివిపేడ్ లోకి వచ్చే స్లిప్ నీ ఓటరు చేతికి అందించే విధంగా ఏర్పాటుచేస్తే ఆ స్లిప్ నీ పోలింగ్ బూత్ ప్రక్కన డ్రాప్ బాక్స్  ఏర్పాటు చేస్తే ఆ బాక్స్ వేసే విధంగా తగిన చర్యలు తీసుకొనవలసినదిగాను కోరియున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఓటరు నమోదు అధికారి మరియు తహశీల్దార్, మండపేట శ్రీ పి. తేజేశ్వర రావు, డిప్యూటీ తహశీల్దార్, కపిలేశ్వరపురం శ్రీ కె.జానకి రామయ్య, మునిసిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ శ్రీ జి.శ్రీనివాస రావు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ శ్రీ పి.ఎ. మెహర్ బాబా, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ ఎం. శ్రీనివాస రావు, ఎన్నికల ఆపరేటర్లు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo