ఆదమరిస్తే ఇక అంతే.. వాహనదారులు జరభద్రం…!
రోడ్డుపై గుంతను వెంటనే పూడ్చాలి.
అధికారులు సకాలంలో స్పందించాలని కోరుతున్న వాహనదారులు.
ఎటపాక మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ కార్యాలయాలు , ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారి మధ్యలో భద్రాచలం నుండి చర్ల వెళ్లే ప్రధాన రహదారిపై పెద్ద గుంత ఏర్పడింది. దాంతో రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది. నిత్యం తెలంగాణ ప్రాంతమైన చర్ల నుండి వస్తున్న ఇసుక లారీలతో రోడ్డు దెబ్బతింది. దాంతో కన్నాయిగూడెం నుండి ఎటపాక వరకు గల రహదారి గుంతల మయంగా మారి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయం వాహనదారులలో వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు సకాలంలో స్పందించి ప్రమాదం జరగకుండా ఈ గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.