కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల వద్ద ఎటువంటి ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లేదా ఇతర న్యూసెన్స్‌లకు తావు లేకుండా చూడాలని, విద్యార్థుల రక్షణకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాల ప్రకారం, జగ్గంపేట మండలం రాజపూడి హైస్కూల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జగ్గంపేట సిఐ వై ఆర్ కె శ్రీనివాస్ నిర్వహించారు . ఈ సందర్భంగా, విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించాలనే సలహా ఇవ్వడం జరిగింది. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గొడవలు లాంటి చర్యలు తీసుకుంటే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని, ఆ విధంగా పాల్పడకూడదని స్పష్టంగా హెచ్చరించారు.ఇక మత్తు పదార్థాలు, పానీయాలను ఉపయోగించడం లేదా వాటిని తీసుకువచ్చే ప్రయత్నాలు చేయకూడదని విద్యార్థులకు సూచించారు. ఎవరైనా ఈ విధమైన దురాక్రమణలు చూస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లకు 100 లేదా 112 లేదా 9440796569, 9440796529 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.ఈ పోలీసు విభాగం అధికారులు వారితో కలిసి చర్చించి, స్కూల్ వద్ద శాంతి భద్రతల పరిస్థితి, విద్యార్థుల రక్షణ, భద్రత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఏ విధమైన సమస్యలు లేదా న్యూసెన్స్ ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.పోలీస్ డిపార్ట్మెంట్ 24×7 విద్యార్థుల రక్షణ కోసం అందుబాటులో ఉంటుందని, పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఇలా పోలీసు శాఖ చొరవతో విద్యార్థులు భయభ్రాంతులు లేకుండా చదువుకోవడానికి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి సానుకూల వాతావరణం కల్పించబడుతుందని జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలియజేశారు.కార్యక్రమంలో హైస్కూల్ హెచ్.ఎం. శ్రీ కే. సుబ్బారావు, ఉపాధ్యాయులు ఎం.కె మొహిద్దిన్, శ్రావణి, చంద్రశేఖర్, నాని బాబు పాల్గొన్నారు.