దుర్గమ్మ తల్లి ఆలయంలో వైభవంగా చండీహోమం, గణపతి హోమం
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలానికి చెందిన రామచంద్రపురం గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 18 శక్తి పీఠాల ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం ఉదయం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయిగుణశేఖర్ ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సమన్వయంతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ మొదటి అంతస్తులోని వనదుర్గ అమ్మవారి ప్రాంగణంలో, మహా చండీ హోమం, గణపతి హోమం సహా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆయనకు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు ప్రసాద్, వైస్ సర్పంచ్ రేవూరి శ్రీను, మాజీ ఎంపీటీసీ సతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పైలా దత్తయ్య, పొడుగు నరసింహం, పైలా గోవింద్, పసుపులేటి గొల్లయ్య, గంధం వెంకన్న, కొలమూరి బుజ్జి, గంధం శివ లు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించారు.భక్తి క్షేత్రమైన ఈ ఆలయానికి సుమారు ఐదు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.