వెదురుపాకలో రేషన్ స్మార్ట్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
ప్రభుత్వం రేషన్ పంపిణీ మరింత పారదర్శంగా జవాబుదారీతనంగా నిర్వహించాలని లక్ష్యంతో పాత కార్డులు స్థానంలో రాజముద్రతో ఏటీఎం కార్డు సైజులో ముద్రించి క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకు రావడం అభినందనీయమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం మండలం వెదురుపాక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ దాసరి సింగరమ్మ అధ్యక్షతన కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రేషన్ సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డు సిస్టం ఏర్పాటు చేసిందని ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీటిని బ్లాక్ మార్కెట్లో అమ్మకూడదని అన్నారు. ఒక కేజీ బియ్యం40 రూపాయల ఖర్చుతో మీకు ఉచితంగా పంపిణీ చేస్తుందని మీరు వాటిని మళ్ళీ అమ్మితే మిల్లర్స్ వాటినే మళ్లీ రీసైక్లింగ్ చేసి మీకు 60 రూపాయలకు అమ్ముతున్నారని దీనివల్ల మీకు, ప్రభుత్వానికి ఎంతో నష్టం వాటిలితుందని రేషన్ అక్రమ దందాను ప్రతి ఒక్కరు అరికట్టాలని ఎమ్మెల్యే నెహ్రూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టిడిపి అధ్యక్షులు పిల్ల చంటిబాబు, సూరంపాలెం ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉంగరాల రాము, గోకవరం సొసైటీ చైర్మన్ గాజింగం సత్తిబాబు, టిడిపి నాయకులు దాసరి తమన్న దొర, మంగ రౌతు రామకృష్ణ, ఎస్ బాబు, గునిపే భరత్, బదిరెడ్డి అచ్చన్న దొర, మలిరెడ్డి సిరి, గల్లా రాము, బొట్టా రామకృష్ణ, నలమహారాజు, గోపీనాథ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జి దుర్గాప్రసాద్, గోకవరం ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎమ్మెస్ ఓ, రేషన్ డీలర్లు అధిక సంఖ్యలో ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

