ఆధునిక యంత్రాలతో వ్యవసాయం లాభసాటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తోంది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ లో కిర్లంపూడి మండలం వీరవరం, తామరాడ గ్రామాలకు చెందిన శ్రీ సత్య ఆగ్రో సి హెచ్ సి గ్రూప్, ముద్దు కృష్ణ డ్రోన్ సి హెచ్ సి రైతు గ్రూపులకు రెండు డ్రోన్ లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీలో వ్యవసాయ పెట్టుబడులను తగ్గించడానికి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించడానికి వ్యవసాయ డ్రోన్ పరికరాలను వినియోగించేలా సబ్సిడీపై వాటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందనివాటితో అన్నదాతలు ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. సాగుకు సాంకేతికతను జోడిస్తే ఖర్చులు ఆదా అవుతాయని, సేద్యం లాభసాటిగా మారుతుందని ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాల వారీగా పరిమితంగా రైతు గ్రూపులకు డ్రోన్లు అందిస్తుందని అందులో భాగంగా వీరవరం, తామరాడ గ్రామాలకు చెందిన ముద్దుకృష్ణ డ్రోన్ సిహెచ్ శ్రీ గ్రూప్, శ్రీ సత్య ఆగ్రో సిహెచ్ సి రైతు గ్రూపు లకు అందించామని అన్నదాతలనుప్రోత్సహించడానికి రాష్ట్రానికి 875 యూనిట్లు మంజూరు చేసింది. ఐదుగురు రైతుల గ్రూపును లబ్ధిదారులుగా గుర్తించింది. జిల్లాల వారీగా ఎంపిక పూర్తి చేసి వ్యవసాయ శాఖతో వారికి శిక్షణ ఇప్పించింది. ఈ డ్రోన్లు అందిస్తున్నామని రూ.8 లక్షల రాయితీతో : ఒక్కో యూనిట్ ధర రూ.9.80 లక్షలు. ఇందులో రైతుల వాటా రూ.1.80 లక్షలు. మిగిలిన రూ.8 లక్షలు ప్రభుత్వమే భరిస్తుంది. రైతుల వాటాను బ్యాంకుల ద్వారా రుణమిప్పించి డ్రోన్ కంపెనీలకు చెల్లించేలా చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ సందర్భంగా కిర్లంపూడి మండల వ్యవసాయ అధికారి ణి నాగం సుధా మాధురి మాట్లాడుతూ కిర్లంపూడి మండలంలో ఇప్పటికే 3 డ్రోన్లు అందించామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు, జనసేన పార్టీ ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్, ఎంపీపీ తోట రవి, మండల టిడిపి అధ్యక్షులు, వీరం రెడ్డి కాశి బాబు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, అనుకుల శ్రీకాంత్, గుడాల రాంబాబు, ఏ ఈ ఓ సురేష్, వి ఏ ఏ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

