జగ్గంపేట ఎస్సై టి. రఘునాథరావు
జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు ఇకపై సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్సై టి. రఘునాథరావు సూచించారు.ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ప్రత్యేక కౌన్సిలింగ్‌లో ఆయన మాట్లాడుతూ, రౌడీ షీటర్లు సమాజంలో మంచి వ్యక్తులుగా మారాలని, ఎటువంటి అసాంఘిక చర్యలు, ఘర్షణలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. మీరు అందరూ మార్పు చూపించాలి. సమాజంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రవర్తించాలి. ఎవరైనా మళ్లీ అక్రమాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం అని హెచ్చరించారు.రానున్న వినాయక చవితి పండుగలు శాంతియుతంగా, సఖ్యంగా జరగాలని కోరుతూ, ఎవరు అసాంఘిక కార్యకలాపాలు, అల్లర్లు సృష్టించినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు