జగ్గంపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన కురుకూరి బుల్లి అబ్బులు ఇటీవల లారీ ప్రమాదంలో కాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, కాకినాడ లయన్స్ క్లబ్ సహకారంతో బాధితుడికి ఆర్థిక సాయంగా రూ. 25,000 మంగళవారం అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కరుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికే మా ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో మరింత మందికి సేవలందించేందుకు సన్నద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.సాయం అందుకున్న బుల్లి అబ్బులు ట్రస్ట్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరి భాస్కరరావు, కాకర్ల సత్యం, బూరుగుపల్లి వెంకటరావు, గద్దె భద్రరావు తదితరులు పాల్గొన్నారు.