కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావుపేటలోని ఏ.సీ.టి. సైన్స్ సెంటర్ వేదికగా కిర్లంపూడి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తామరాడ పదవ తరగతి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.ఉదయం సెషన్‌లో రసాయన సమీకరణాలు, చర్యలకు సంబంధించిన ప్రయోగాలు విజయవంతంగా చేయగా మధ్యాహ్నం ఆమ్లాలు క్షారాలు లవణాలపై ప్రయోగాలు జరిపి శాస్త్రపరమైన అవగాహన పెంచుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థి నవీన్ పాములు ఎదురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై విలువైన సూచనలు అందించారు.వర్క్‌షాప్‌లో ఆ పాఠశాల గణిత ఉపాధ్యాయులు పరమేశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థులకు అల్పాహారం అందజేయడంలో మిషన్ అన్నపూర్ణ సహాయనిధి వ్యవస్థాపకుడు రాజేష్‌కుమార్ ప్రత్యేక సహకారం అందించారు.