డ్రోన్ కెమెరాతో పరిసరాల పర్యవేక్షణ
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని అక్షర జూనియర్, డిగ్రీ కళాశాల పరిసరాల్లో మంగళవారం పోలీసుల ప్రత్యేక నిఘా చేపట్టారు. విద్యార్థినీలు ఎటువంటి ఈవ్ టీజింగ్ లేదా ర్యాగింగ్‌కు గురికాకుండా ఉండేందుకు పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో పర్యవేక్షణ నిర్వహించారు.విద్యార్థులు కాలేజీలు, స్కూల్‌లు విడిచి వెళ్లే సమయాల్లో పోలీసులు గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించారని జగ్గంపేట సి ఐ వై.ఆర్.కే. శ్రీనివాస్ తెలిపారు.విద్యార్థినీలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.కాలేజీ, స్కూల్ పూర్తయ్యే సమయాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారుఈ చర్యలు విద్యార్థినీ భద్రతే కాకుండా, సామాజిక భద్రత పరిరక్షణలో భాగమని పేర్కొన్నారు