ఫైర్ స్టేషన్ ని సందర్శించిన వివేకానంద విద్యార్థులు
విద్యార్థులకు వ్యవస్థల పట్ల క్షేత్ర స్థాయి అవగాహన కల్పించడంలో భాగంగా మంగళవారం జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యాసంస్థల విద్యార్థినీ విద్యార్థులు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఫైర్ స్టేషన్ ని సందర్శించి అగ్నిమాపక వ్యవస్థ పనితీరు,నిర్వహణ గురించి అవగాహన కల్పించుకున్నారు. ఫైర్ స్టేషన్ అధికారి చల్లా అనిల్ కుమార్ విద్యార్థులకు పలు అంశాలను ప్రాక్టికల్ గా చేసి చూపించి అవగాహన కల్పించారు.విద్యార్థులు పలు ప్రశ్నలు అడిగి వారికి కలసిన అవగాహనను పొందినారు.ఫైర్ స్టేషన్ కి ఫైర్ జరిగినప్పుడు ఎలా సమాచారం వస్తుందో, వచ్చిన సమాచారాన్ని వారు ఏరకంగా స్పందిస్తారో, ప్రమాదం జరినప్పుడు 101 ఎలా పనిచేస్తుందో, ఫైర్ ఇంజిన్ పని చేసే విధానం అందులో ఉన్న వివిధ పరికరాలు తదితర విషయాలు,ప్రమాదకర వాయువులను ఎలా గుర్తించే విధానం మరియు వాటిని నియంత్రించే విధానం, ఫైర్ ని నియంత్రించేటప్పుడు అనుసరించే ప్రోటోకాల్స్, అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకునే ముందస్తు చర్యలు, జరిగిన తరువాత ఎలా నియంత్రించాలో తదితర ఎన్నో విషయాలు విద్యార్థులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ స్టడీ టూర్ ని విద్దేశించి సంస్థ ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ పిల్లల సమగ్ర అభివృద్ధికి, వ్యకిగత పరిమితికి, వ్యవస్థల పట్ల అవగాహనకు,సమాజం పట్ల వారి భాధ్యతను పెంచడానికి ఈ స్టడీ టూర్స్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. సహకరించిన ఫైర్ స్టేషన్ అధికారులకు, సిబ్బందికి కృతఙ్ఞతలు తెలియజేసారు.ఈ పర్యటనలో వివేకానంద సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.