మాజీ మంత్రి తోట నరసింహం పై ఫైర్ అయ్యిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా రాజుపాలెం, రామవరం రోడ్డు వేయించాలని బుధవారం మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం నిరసన తెలియజేయడంపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నరసింహం గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ రోడ్డును పూర్తి చేయలేదని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు ముందుగా ఆయన స్వాగతిస్తున్నారని అన్నారు. గత టిడిపి పాలనలో రింగ్ రోడ్డు, సామర్లకోట గోకవరం రోడ్డు నేను శాంక్షన్ తెచ్చుకుంటే, రాజుపాలెం, రామవరం రోడ్డు 29 కోట్ల రూపాయలు ఆనాటి పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం శాంక్షన్ తెచ్చుకున్నారని ఈ రెండు రోడ్లు నేను పూర్తి చేయించుకున్నానని ఆ రోడ్డుకు టెండర్లు పిలవకపోవడం తర్వాతే ఎన్నికల రావడం ఎన్నికల్లో వైసీపీ గెలుపొందించడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ రోడ్డుతో పాటు 14 వర్కులు కలిపి కాసులకు కక్కుర్తి పడి గత వైసిపి ప్రభుత్వం టెండర్లు పిలవడంతో ఆ పనులు సబ్ కాంట్రాక్టు ద్వారా డ్రైనేజీలు, కొద్ది దూరం సిమెంట్ రోడ్లు వేసి కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడంతో ఆ ఆగిపోయాయని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనను ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కాదని ఆయనను ఇన్చార్జిగా సంవత్సరం కాలం కొనసాగించారని అప్పుడు ఈరోజు ప్రభుత్వంతో చెప్పి పూర్తి చేయాలని గుర్తు రాలేదా నరసింహ అని నెహ్రూ అన్నారు. ఈరోజు సంవత్సర కాలంలోనే కోట్లాది రూపాయలతో మల్లిసాల గోకవరం రోడ్డు, రామవరం ఇ ర్రిపాక రోడ్డు ఇలా అనేక రోడ్లు వేయి వేయించటమే కాకుండా సిమెంట్ రోడ్లు, నాలుగు గ్రామాలకు 3000 ఎకరాలకు మూడున్నర కోట్లతో ఈ నెల 25న జ్యోతుల పాపారావు ఎత్తిపోతల పథకాన్ని కూడా టెండర్లు పిలవడం జరుగుతుందని అన్నారు. ఈనెల 22వ తేదీన ఉమ్మడి జిల్లాలో 42 కోట్లు పనులకు టెండర్లు పిలవగా కాకినాడ జిల్లాకు 32 కోట్లు, అదేవిధంగా నియోజకవర్గంలో 18 కోట్లతో టెండర్లు పిలవడం జరుగుతుందని అన్నారు. రాజుపాలెం, రామవరం రోడ్డుకి తాత్కాలిక మరమ్మతుల కోసం 28 లక్షలు సాంక్షన్ చేయించి పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు. గత 15 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించి సొంత రోడ్డు వేయించుకోకుండా నన్ను విమర్శించడం నీకు తగునా నరసింహ అని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, వాసిరెడ్డి ఏసు దాసు, సత్తి సదాశివరెడ్డి, చింతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

