ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ నా తండ్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని, మా కుటుంబంపై శ్రద్ధ చూపుతున్నందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానుఅని అన్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి, ఆయన త్వరగా కోలుకుని ప్రజా సేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. అలాగే పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయిలో కష్టపడి పనిచేయాలని గిరిబాబుకు సూచించారు.