జగ్గంపేట నియోజకవర్గం లో వైయస్సార్ జయంతి వేడుకలు ఆయా మండలాల్లో ఘనంగా నిర్వహించారు.దీనిలో భాగంగా మండల కేంద్రమైన జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తమ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు జ్యోతుల రామస్వామి ఆధ్వర్యంలో జగ్గంపేట గ్రామ ఉపసర్పంచ్ బండారు రాజా అధ్యక్షతన వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ కార్యాలయం నుంచి అధిక సంఖ్యలో బైక్ ర్యాలీతో మెయిన్ రోడ్ లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి చేరుకున్నారు. అనంతరం అభిమానుల నడుమ భారీ కేకును కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు తినిపించారు ఈ సందర్భంగా బండారు రాజా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించాలని జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు .తమ నాయకుడు చంటిబాబు అందుబాటులో లేకపోయినా పిలుపుమేరకు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు రావడం సంతోషదాయకరం అన్నారు .ఈ కార్యక్రమంలో దోమల గంగాధర్ ఏళ్ల అప్పారావు కాపు కంచి లక్ష్మణ దొర ముద్దాడ రాజబాబు బొద్దిరెడ్డి చక్రరావు జాన్ వెస్లీ ఉయ్యూరు నాని సూరిమిల్లి రాంబాబు కోన ముత్యాలరావు కర్రీ శ్రీను ముమ్మన సోమరాజు చిట్టిమోని సత్యనారాయణ ములoపాక సురేష్ కొట్టు శివ రామకృష్ణ కేసునీడి శ్రీను వల్లేపు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.