Monday, August 4, 2025
Monday, August 4, 2025

వైసీపీ నేతలకు కళ్ళు కనిపించడం లేదా…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సూపర్ సిక్స్ లో మూడు పథకాలు అమలు చేశాం…

ఆగష్టు లోగా మరో రెండు పథకాలు అమలు చేస్తాం…

వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు…

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వైసీపీ నేతలపై ఎమ్మెల్యే వేగుళ్ళ మండిపాటు…

 

మండపేట

ఎన్నికలప్పుడు ఇచ్చిన ఆరు వాగ్ధానాలకు గానూ ఇప్పటికే మూడు అమలు చేశాం,ఆగష్టు నెలలోగా మరో రెండు అమలు చేయనున్నాం, అయినా సరే వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బహుశా వారికి కళ్ళు కనిపించడం లేదేమో అంటూ మండిపడ్డారు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తొలుత రాయవరం మండలం, నదురుబాద గ్రామం నుండి ఉదయం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి నదురుబాద అనంతరం వి.సావరం గ్రామాలలో ఎమ్మెల్యే వేగుళ్ళ ఇంటింటికీ పర్యటించారు. అనంతరం మధ్యాహ్నం మండపేట 9వ వార్డులో ఎమ్మెల్యే వేగుళ్ళ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పథకాలు అన్ని అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజలు చెప్పిన సమస్యలను ప్రభుత్వం రూపొందించిన యాప్ లో నమోదు చేశారు. అనంతరం వేగుళ్ళ మాట్లాడుతూ గత వైసీపీ పాలనకు ఇప్పటి కూటమి ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. గత ప్రభుత్వం విధ్వంసం తో పాలన సాగిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం సుపరిపాలనే ధ్యేయంగా పాలన సాగిస్తుందన్నారు. ఇప్పటికే పాత పింఛను కాకుండా వృద్ధులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 3000 రూపాయలు పెంచి అందివ్వడం జరిగిందన్నారు. అలాగే తల్లికి వందనం పథకంలో భాగంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది కి 15000 చొప్పున అందివ్వడం జరిగిందన్నారు. దీపం పథకం లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ లను అందించామన్నారు. అలాగే యువత కు 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగ ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, మరో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఇప్పటికే పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో మిగతా లక్ష్యాలను సాధిస్తామన్నారు. రైతు సంక్షేమం పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనుండగా,ఆగస్టు నెలలో ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు కానుందన్నారు. కేవలం ప్రతీ మహిళకు 1500 రూపాయలు ఇవ్వాల్సిన పథకం ఒక్కటే పెండింగ్ లో ఉందన్నారు. అది కూడా జగన్ దుర్మార్గంగా చేసిన లక్షల కోట్ల అప్పులే కారణమన్నారు. ఇవే కాకుండా అన్నా క్యాంటీన్ లను పునరుద్ధరించి పేదలకు కడుపునిండా అన్నం పెట్టడం జరుగుతుందన్నారు.12,500  కోట్ల నిధులతో పోలవరం ప్రాజెక్టు ను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు.అమరావతిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గుంతల రోడ్లతో ప్రజలు నరకం చూడగా కూటమి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో రోడ్లను అభివృద్ధి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించడం జరిగిందన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం అందించడం జరిగిందన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20వేల రూపాయల భృతి అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. అంగన్వాడీల సంక్షేమానికి గ్రాట్యుటీ ప్రకటించారన్నారు. మహిళల సంక్షేమానికి బ్యాంకు రుణాలను 13 శాతం నుండి 11 శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. ముఖ్యంగా రౌడీ షీటర్ లు, స్మగ్లర్లు, గంజాయి రవాణా పై ఉక్కుపాదం మోపి నేరాలను గణనీయంగా తగ్గించడం జరిగిందన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల ఆస్తులను కొట్టేయాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ను ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేయడం జరిగిందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo