Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications

శాంతి భద్రతలకే ప్రాధాన్యం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట సర్కిల్ పరిధిలో 11 మందిపై బౌండ్ ఓవర్ కేసులు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని సర్కిళ్ల పోలీసులకు స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ నేపథ్యంలో, జగ్గంపేట సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 11 మంది మీద బౌండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడ్డాయి.జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కె. ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల్లో భాగంగా, గండేపల్లి గ్రామంలో తరచూ గొడవలకు పాల్పడుతున్న ప్రక్కప్రక్క వాసులైన 6 మందిపై బౌండ్ ఓవర్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఎర్రంపాలెంకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను అనుమానంతో వేధించడాన్ని గుర్తించిన పోలీసులు అతనిపై కూడా చర్యలు తీసుకున్నారు.ఇదే విధంగా, నాయకంపల్లి-కోటపాడు మార్గంలో కమర్షియల్ సెక్స్ వర్క్‌కు ప్రోత్సాహం ఇస్తున్న ఘటనపై గండేపల్లి మండలానికి చెందిన వ్యక్తిపై బౌండ్ ఓవర్ కేసు నమోదు చేసి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచారు.సురంపాలెంకు చెందిన మరో వ్యక్తి మహిళకు అనుచితంగా మెసేజ్ పంపినందుకు ఆయనపై కూడా బౌండ్ ఓవర్ నమోదు చేయగా, జగ్గంపేట పట్టణంలో గంజాయి విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరు పెడలర్లను పట్టుకుని, స్థానిక మేజిస్ట్రేట్ (ఎం ఈ ఎం)ఎదుట హాజరుపరిచి బౌండ్ ఓవర్‌కి గురిచేశారు.ఈ మొత్తం పరిణామాలపై స్పందించిన సీఐ వై.ఆర్.కె. మాట్లాడుతూ:జిల్లా ఎస్పీ ఆదేశాలను అనుసరిస్తూ, శాంతి భద్రతలను భంగపరిచే ఎవరైనా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందే. బౌండ్ ఓవర్ వంటి చట్టపరమైన చర్యల ద్వారా వారిని సత్ప్రవర్తన దిశగా మలచే ప్రయత్నం చేస్తున్నాం,” అని స్పష్టం చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo