జగ్గంపేట మండలం సీతానగరం వెలసిన శ్రీ ఏగులమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన సీతానగరం గ్రామదేవత ఏగులమ్మ అమ్మ వారు ఆదివారం శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లుతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను కూడా కూరగాయలతో అలంకరించారు. అనంతరం గ్రామంలో మహిళలందరూ అమ్మవారికి సమర్పించేందుకు ఊరేగింపుగా బయలుదేరి ఏగులమ్మ అమ్మవారికి సారే, చీర, నైవేద్యాలు సమర్పించారు. అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.పాల్గొని ఈ కార్యక్రమంలో సీతానగరం ఏ గులమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.