Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

సాంఘిక సంక్షేమ శాఖ బాలికల నూతన వసతి గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

స్థానిక సచివాలయం 2 వద్ద సాంఘిక సంక్షేమ శాఖ బాలికల నూతన వసతి గృహాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. తరగతి గదులను ఎస్వీఎస్ అప్పలరాజు, విశ్రాంతి గదులను జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, వంటశాలను మారిశెట్టి భద్రం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థిని లను పేరుపేరునా పలకరించి చక్కగా చదువుకోవాలని సూచించారు. అనంతరం హాస్టల్ వార్డెన్ రోజా ఎమ్మెల్యే నెహ్రూ కు ఇంతటి చక్కటి వసతి సముదాయాన్ని బాలికలకు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రామవరం ఇందిరా యానాదుల కాలనీలో సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో వారికి ఇక్కడ నూతన వసతి గృహం ఏర్పాటు చేశామని వారికి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషలాఫీసర్ సత్యనారాయణ, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వై వాణి, ఎండిఓ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బో దిరెడ్డి శ్రీనివాస్ వేములకొండ జోగారావు, ఈవోపీఆర్డి భాస్కరరావు, హాస్టల్ వార్డెన్స్ రోజా, ప్రభాకర్, నండ్ల చిరంజీవి, రాయి సాయి, పంచాయతీ సెక్రెటరీ శివ అధిక సంఖ్యలో విద్యార్థిని ల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo