Monday, August 4, 2025
Monday, August 4, 2025

సుపరిపాలనలో తొలి అడుగు… ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేటఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షుడు నవీన్‌

జగ్గంపేట

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పని చేస్తోందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. బుధవారం జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమై, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో అమలు చేసిన హామీలను, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు రాష్ట్రం ఎలా గాడిలో పడిందన్నదాన్ని ప్రజలకు వివరిస్తూ అభిప్రాయాలు సేకరించారు.గతంలో విధ్వంసం పాలించిన పాలన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం. వచ్చే నాలుగు సంవత్సరాల్లో మరింత వికాసం సాధించేందుకు కృషి కొనసాగుతుంది,” అని నెహ్రూ అన్నారు.ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ, “సూపర్ సిక్స్ పథకాల అమలుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ మార్గంలో ముందుకు సాగుతోంది” అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, అడపా భరత్‌బాబు, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, ముత్యాల సత్యనారాయణ, కోడూరి సత్యనారాయణ, కాకర్ల కృష్ణాజీ, తాతిన నాగేశ్వరరావు, గూడపాటి పెద్ద, పిండి రెడ్డమ్మ, ఈర్పిన శ్రీను, దాపర్తి సీతారామయ్య, ఆత్మకూరి వెంకటకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo