భూపతిపాలెం స్కూల్లో మెగా మెడికల్ క్యాంప్, కొత్త లైబ్రరీ ప్రారంభం
ముఖ్యఅతిథిగా హాజరై పూర్వ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
గోకవరం మండలం భూపతిపాలెం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు మెగా మెడికల్ క్యాంపు తో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్కూల్లో ఉన్న విద్యార్థులు అందరికీ కంటి చూపు చికిత్స, చర్మవ్యాధుల చికిత్స, దంత సమస్యలపై మెడికల్ క్యాంపు పెట్టి టెస్టు చేశారు. అనంతరం లక్ష రూపాయలతో లైబ్రరీకి పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల నూతన కమిటీ ప్రెసిడెంట్ సుజ్ఞాన్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూలుకు పూర్వ విద్యార్థులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గురుకుల పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఈరోజు విద్యార్థులకు వైద్య పరీక్షలు, వారి మేధోసంపత్తికి ఎంతో ఉపయోగపడే బుక్స్ లైబ్రరీ ఏర్పాటు చేయించడం చాలా అభినందనీయమని మీరు కూడా అదే స్థాయిలో కష్టపడి చదువుకుని రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించాలని విద్యార్థులను ఎమ్మెల్యే కోరారు. అనంతరం మెడికల్ క్యాంపు లో పాల్గొన్న డాక్టర్స్ ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టిడిపి అధ్యక్షులు పిల్లా చంటిబాబు, పోతుల మోహనరావు, భూపతిపాలెం గురుకుల పాఠశాల చైర్మన్ గల్లా రాము, సర్పంచులు యిడుదల అర్జున్ రావు, కమ్మెల వెంకటేశ్వరరావు, ఎంపీటీసి మరిసేఅరుణఅప్పారావు,బదిరెడ్డి అచ్చన్న దొర, దాసరి సీతారామకృష్ణ, ఎస్ బాబు, పోసిన ప్రసాద్, వైస్ చైర్మన్ రాజీవ్, మెడికల్ క్యాంపు డాకాటన్,డాఅడ్డాలసత్యనారాయణ,డావివిమూర్తినిర్వహించబడింది,అలుమ్నిఅసోసియేషన్పూర్వఅధ్యక్షుడురత్నకుమార్, వర్మ పి.బి. శ్రీనివాస్, ,వైస్ ప్రెసిడెంట్ పరమహంస, జయచంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీహరి పి ఎస్ కె నాగేశ్వరరావు, ప్రసాదబాబు గోపాల్ , ఈసీ మెంబర్ పట్టాభి , మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

