కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె కొత్తూరు శివారు వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద హిందూ జనశక్తి కాకినాడ జిల్లా అధ్యక్షులు బోధ శివభద్రరావును ఆలయ కమిటీ చైర్మన్ నకిరేడ్డి శివ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులందరూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శివ మాట్లాడుతూ సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న బోధ శివభద్రరావు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారి ఆలయం ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించుకున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని ఆచరించి సన్మార్గంలో నడిచే విధంగా హిందూ గ్రంధాలు సూచిస్తున్నాయని వారు అన్నారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శివ భద్రరావు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన మహిమగల అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ సన్మానం అందుకోవడం నా పూర్వజన్మ సుకృతమని శివ భద్ర రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మోటూరు వెంకన్న, బద్ది సురేష్, దంట కామరాజు, అడపా తాతాజీ, మరిసే కృష్ణ, గంప విష్ణు మహేష్, ఆలయ అర్చకులు సోంబాబు తదితరులు పాల్గొన్నారు.