డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంగళవారం ఎమ్మార్వో ఐపి శెట్టి, ఎస్సై డి సురేష్ బాబు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వెళ్లే రూట్ మ్యాప్ ను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం లో ఎలాంటి అపశృతులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణనాథుల శోభా యాత్రను నిర్వహించాలని మండలం లోని పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో లకు సూచించారు. పోలీసులతో సమన్వయం చేసుకొని వారి సూచనలను పాటిస్తూ, నిర్దేశించిన మార్గంలోనే ఊరేగింపు జరపాలని మండపాల నిర్వాహకులకు వివరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

