స్మార్ట్ గవర్నమెంట్
స్మార్ట్ ఆలోచన
జగ్గంపేటశాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా గండేపల్లి రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. మంగళవారం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామం నందు నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇది తమ కూటమి ప్రభుత్వానికి వచ్చిన స్మార్ట్ ఆలోచన అని, గతంలో మాదిరిగా పెద్ద పుస్తకాల వలే కాకుండా ఏటిఎం, ఆధార్ కార్డుల తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారుడు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతోందని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్ రైస్ కార్డులను రూపొందించడం జరుగుతుందని, సదరు కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ సరుకుల వివరాలు, కేటాయించిన పరిమాణం, రేషన్ పొందిన స్థితి, డిపో వివరాలు తెలుస్తాయన్నారు . అంతే కాకుండా రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు . కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా త్వరలో అర్హులందరికీ కొత్త కార్డులు అందజేయడం జరుగుతుందని, గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని, వైకాపా జారీ చేసిన రేషన్ కార్డుల్లో వారు ఫొటోలు ముద్రించుకున్నారని, నేడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్ర, లబ్ధిదారుల ఫొటోలను మాత్రమే ముద్రించిందన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, తోట రవి, కందుల చిట్టిబాబు, కుంచె రాజా, కంటిపూడి సత్యనారాయణ, పాలకుర్తి ఆదినారాయణ, గండేపల్లి ఎమ్మార్వో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

