రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేటలో అంబరాన్నంటాయి. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి భాగస్వామి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధతతో కూడిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు వేడుకలు కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరగడం ఆనందకరం. ఇది కూటమి ఐక్యతకు నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడికి తమ్ముడిలా ఉంటూ నిబద్ధతతో రాజకీయం చేస్తున్నారు. ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని తెలిపారు.ఈ వేడుకలో కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, అప్పలరాజు, బిజెపి నాయకుడు దాట్ల కృష్ణ వర్మ, జనసేన నాయకులు బుదిరెడ్డి శ్రీనివాస్, పాలిశెట్టి సతీష్, ఏఎంసి వైస్ చైర్మన్ ముదిరాజ్ శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ పాలిశెట్టి సతీష్, ఏఎంసి డైరెక్టర్ సింగులూరి రామ్, దీపు, కిర్లంపూడి మండల అధ్యక్షుడు ఉలిసి అయిరాజు, జగ్గంపేట మండల అధ్యక్షుడు మరిసే రామకృష్ణ, జగ్గంపేట మండల యూత్ అధ్యక్షుడు మొగులు గంగాధర్, జగ్గిమడుగు మండల ఐటీ కోఆర్డినేటర్ నరేష్, గండేపల్లి మండలం బిసి సెల్ అధ్యక్షుడు వీరబాబు, రామ్ రెడ్డి, జగ్గంపేట మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు గెద్ద బాబురావు, మండపాక శ్రీరామ్, పాలిక కృష్ణ, పల్లిబోయిన మణికంఠతో పాటు కోటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

