జగ్గంపేట ఎస్సై రఘునాధరావు
జగ్గంపేట మండలంలో నిర్వహించే వినాయక చవితి నిమజ్జన వేడుకలలో ప్రజలు, కమిటీ సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నడుచుకోవాలని జగ్గంపేట ఎస్సై టీ రఘునాధరావు అన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట పరిసర ప్రాంతాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలకు, నిమజ్జన సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు.ఈ కార్యక్రమాలను రాత్రి 10 గంటల లోపు ముగించాలన్నారు. ముఖ్యంగా ట్రాంజెండర్ తో డ్యాన్సులు వేయించడం,మందు గుడి సామాగ్రి కాల్చడం,మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనడం వంటివి చేయరాదన్నారు.పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రఘునాథరావు హెచ్చరించారు.

