కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన జీను మణి బాబును జగ్గంపేట మేదర సంఘం అధ్యక్షులు పిల్లి రమణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు జీనుమణి బాబును జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ మండల పార్టీ అధ్యక్షుడుగా నియమించిన శుభ సందర్భంగా ఆయనను మర్యాదపరంగా కలిసి సత్కరించామని మా సమస్యలు వారికి తెలియజేసామని రమణ అన్నారు. జీను మణిబాబు మాట్లాడుతూ మీ సమస్యలను ఎమ్మెల్యే నెహ్రూ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రొట్ట ఏసుబాబు, దొమ్మ దుర్గారావు, మొగ్గ ఆనంద్, దొమ్మ బద్రి, రొట్ట సత్తిబాబు, రొట్ట అప్పారావు తదితర మేదర సంఘం సభ్యులు పాల్గొన్నారు.

